ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ విడుదలతో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ సంబరం అంబరాన్ని తాకింది. పుష్పరాజ్ పాత్రను మరోసారి తెరపై చూడాలని అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్‌కి తరలివచ్చారు.
గత నెలలో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతిచెందగా, బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పుష్ప-2 రీలోడెడ్ విడుదల సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ సంధ్య థియేటర్‌కు పోటెత్తడం హాట్ టాపిక్‌గా మారింది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.