టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. బీసీసీఐ అతడిని జట్టు నుంచి విడుదల చేసి స్వదేశానికి పంపింది. బుమ్రా భారత్‌కు చేరుకుని సుమారు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు.
ఇప్పుడు అతడిని సెప్టెంబరులో జరిగే ఆసియా కప్ (T20) కోసం సిద్ధం చేయాలా, లేక అక్టోబరులోని వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కోసం ఉంచాలా అన్నదానిపై సెలెక్టర్లలో చర్చ సాగుతోంది.
ఒకవేళ భారత్ ఆసియా కప్ ఫైనల్‌కి చేరితే, బుమ్రాకు నాలుగు రోజుల గ్యాప్‌లోనే విండీస్ టెస్ట్ ఆడాల్సి ఉంటుంది – ఇది వర్క్‌లోడ్ దృష్ట్యా అసాధ్యం అని బీసీసీఐ భావిస్తోంది.
నవంబరు లో దక్షిణాఫ్రికాతో కూడా టెస్టులు ఉండటంతో, బుమ్రాను టెస్ట్ మ్యాచ్‌లకే ప్రాధాన్యతనిస్తూ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.







