ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో, నిర్ణయాత్మక టెస్టు నుంచి టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తప్పుకోవడం ఖాయమైంది. బుమ్రా పనిభారం తగ్గించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తో వెనుకబడి ఉంది. సిరీస్‌ను కాపాడుకోవాలంటే ఓవల్ వేదికగా జరగనున్న చివరి టెస్టులో భారత్ తప్పక గెలవాలి. ఈ కీలక మ్యాచ్‌లో బుమ్రా అవసరం ఉన్నప్పటికీ, అతడి ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ వైద్య బృందం విశ్రాంతిని సిఫారసు చేసింది.
బుమ్రా స్థానంలో యువ పేసర్ ఆకాశ్ దీప్ తుది జట్టులోకి రానున్నాడు. స్వల్ప గాయం కారణంగా మాంచెస్టర్ టెస్టుకు దూరమైన ఆకాశ్, ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో పది వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేసిన ఆకాశ్ దీప్, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో బుమ్రా ఆడిన మూడు టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు.








