తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా ప్రారంభమయ్యాయి. నల్ల దుస్తులు ధరించి, చేతులకు బేడీలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోకి అడుగుపెట్టారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ వారు ఈ ఆందోళన చేపట్టారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేల నిరసన
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. లగచర్ల రైతుల పట్ల అన్యాయంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలతో అసెంబ్లీ సమావేశాలు మరింత హోరాహోరీగా సాగనున్నాయి. రైతు సమస్యలు, బిల్లులపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనే దానిపై అందరి దృష్టి నిలిచింది.
ఈరోజు సభలో యంగ్ ఇండియా బిల్లు, యూనివర్సిటీ సవరణ బిల్లుపై ఉదయం చర్చ జరగనుంది.








