బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై చేయిచేసుకున్న కేసులో సోమవారం సాయంత్రం కౌశిక్‌రెడ్డిని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరగడంతో సంజయ్‌కుమార్‌ను కౌశిక్‌రెడ్డి నెట్టివేశారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం.
తనను కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడుతూ నెట్టివేశారని కరీంనగర్ పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ నుంచి కరీంనగర్‌కు తరలిస్తున్నారు. కాగా, ఈ అరెస్టుపై బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది.
సంజయ్‌కుమార్ బీఆర్ఎస్ తరఫున జగిత్యాల నుంచి పోటీచేసి నెగ్గారు. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆగ్రహంతో ఉన్నారు. సంజయ్‌కుమార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలవాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.