అమెరికాలో ప్రమాదం.. BRS నేత కూతురు సహా ముగ్గురు మృతి

అమెరికాలో ప్రమాదం.. BRS నేత కూతురు సహా ముగ్గురు మృతి

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు మరణించారు. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నేత‌, మాజీ MPTC మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అలాగే ఆమె అత్త సునీత (56) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సునీత సిద్దిపేట జిల్లా బక్రీ చప్రియాల్ గ్రామానికి చెందినవారని సమాచారం. బాధితుల కుటుంబ సభ్యులు అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తోటి ప్రవాస భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment