బ్రిస్బేన్ టెస్టు ఆసక్తికర మలుపు తిరిగింది. భారత బౌలర్ల దాడికి ఆసీస్ జట్టు విలవిల్లాడుతోంది. త్వరగా రన్స్ చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని ప్రయత్నించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లకు నిరాశే మిగిలింది. అత్యంత స్వల్ప స్కోర్‌కు ఐదు వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆసిస్ బ్యాటర్స్ మెక్స్వెల్, ఖవాజా, లబుషేన్, మిచెల్ మార్ష్, స్మిత్ భారత బౌలర్లను ఎదుర్కోలేక పెవిలియన్ బాటపట్టారు. బుమ్రా, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, సిరాజ్ ఒక కీలక వికెట్ తీశాడు. ప్రస్తుతం క్రీజులో హెడ్, క్యారీ ఉన్నారు. 33/5 స్కోరుతో ఆసీస్ భారీ ఒత్తిడిలో పడింది.
మూడో టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు ఆట భారత్‌కు మరింత అనుకూలంగా మారుతుందా, లేదా ఆసీస్ కోలుకుని పుంజుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.