రిటైర్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం.. ట్రెండింగ్‌లో #BoycottBCCI

రిటైర్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం.. ట్రెండింగ్‌లో #BoycottBCCI

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, ర‌న్ మెషీన్‌ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఇద్ద‌రు లెజెండ‌రీ క్రికెట‌ర్లు వారం రోజుల వ్య‌వ‌ధిలో ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం అభిమానుల‌ను షాక్‌కు గురిచేసింది. రిటైర్మెంట్ నిర్ణ‌యం వెనుక బోర్డు ఒత్తిడే ప్ర‌ధాన‌ కారణమంటూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ ఈ నిర్ణ‌యాన్ని స్వ‌చ్ఛందంగా తీసుకోలేద‌ని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.

బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి
ప్ర‌ముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్)లో “#BoycottBCCI” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కోట్లాది మంది రోహిత్ శ‌ర్మ‌, కింగ్ కోహ్లీ అభిమానులు రిటైర్‌మెంట్‌పై తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు. “ఇది కోహ్లీ తీసుకున్న స్వచ్ఛంద నిర్ణయం కాదు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎందుకు కోహ్లీని పిల‌వ‌లేదు..? ఒక లెజెండ్‌ని ఇంతలా నిర్లక్ష్యం చేయాలా? దేశం కోసం ఆడే క్రీడాకారుడిని పక్కన పెట్టేస్తారా?” అని కోహ్లీ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా బీసీసీఐపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. “కోహ్లీని అవమానించడమే కాదు, ఇండియన్ క్రికెట్‌కు ఆయన చేసిన సేవలను మరిచిపోయే ప్రయత్నం ఇది” అంటూ కొంతమంది నెటిజన్లు బీసీసీఐపై నేరుగా విమర్శలు చేస్తున్నారు.

గంభీర్‌పై హిట్‌మ్యాన్‌, కింగ్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం
కోహ్లీ రిటైర్మెంట్‌కు ఐదు రోజుల ముందు హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ టెస్ట్ ఫార్మ‌ట్‌కు వీడ్కోలు ప‌లికారు. వారం రోజుల వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు లెజెండరీ క్రికెట‌ర్స్ వైట్ జెర్సీకి దూర‌మ‌వ్వ‌డంతో విమ‌ర్శ‌లు తీవ్ర‌మ‌య్యాయి. రోహిత్ ఫ్యాన్స్ సైతం బీసీసీఐపై తీవ్ర ఆగ్ర‌హంగానే ఉన్నారు. ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు టెస్ట్ క్రికెట్‌కు దూర‌మ‌వుతుండ‌గా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా, వీరిద్ద‌రు రెడ్ బాల్ క్రికెట్‌కు దూరం అవ్వ‌డానికి హెడ్ కోచే కార‌ణ‌మ‌ని మ‌రొక‌వ‌ర్గం విమ‌ర్శ‌లు చేస్తుంది. టీమిండియాకు ఎన్నో కీల‌క విజ‌యాల‌ను అందించిన క్రికెట‌ర్లను ఎలా వ‌దులుకున్నార‌ని వారి ఫ్యాన్స్ నుంచి ప్ర‌శ్న‌లు తీవ్ర‌మ‌య్యాయి.

స్పందించ‌ని బీసీసీఐ
టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, వన్డేలు, టీ20ల్లో కోహ్లీ కొనసాగనున్నారు. బీసీసీఐ తీరు చూస్తుంటే వ‌న్డే, టీ20 ఫార్మాట్ల‌కు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయ‌ని అభిమానులు వారి అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఇప్పటి వరకు బీసీసీఐ ఈ ఆరోపణలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అభిమానుల ఆగ్రహం చూస్తుంటే, సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment