హైదరాబాద్ (Hyderabad) లో 13 ఏళ్ల బాలుడు (Boy) చేసిన చిన్న పని, ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆస్తిని మిగిల్చింది. ఆ బాలుడు కాపాడిన ఆస్తి విలువ (Property Value) ఎంతంటే.. అక్షరాల రూ.3,900 కోట్లు. ఇంతకీ ఏం చేశాడంటే.. జూబ్లీ హిల్స్ (Jubilee Hills) ప్రాంతంలోని JRC కన్వెన్షన్ సెంటర్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలం ప్రభుత్వానికి చెందినదిగా తేలింది. లంగర్ హౌస్ (Langer House) కు చెందిన ఓ బాలుడు, అక్కడ రోజూ క్రికెట్ ఆడేవాడు. కొన్ని రోజుల క్రితం, నార్నె ఎస్టేట్స్ (Narne Estates) అనే సంస్థ ఆ భూమిలో కంచె వేసి తవ్వకాలు ప్రారంభించడంతో అతనికి అనుమానమొచ్చింది.
వెంటనే ఆ బాలుడు హైడ్రా (HYDRA)కు లేఖ రాశాడు. బాలుడి లేఖ (Letter) ఆధారంగా పరిశీలన చేసిన అధికారులు, అది ప్రభుత్వ భూమి (Government Land) అని గుర్తించారు. దీంతో దాదాపు 39 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ రూ.3,900 కోట్లు ఉండటంతో, బాలుడి తెలివితేటలు ప్రభుత్వాన్ని భారీ నష్టంనుంచి రక్షించింది. అతని బాధ్యతాయుతమైన ప్రవర్తనకు అధికారులు ప్రశంసలు కురిపించారు. ఒక్క లెటర్‌లో రూ.3,900 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడిన బుడ్డోడిని అందరూ అభినందించారు.








