వైఎస్సార్‌ను త‌లుచుకొని బొత్స భావోద్వేగం.. అచ్చెన్నయుడిపై ఫైర్‌ (Video)

వైఎస్సార్‌ను త‌లుచుకొని బొత్స భావోద్వేగం.. అచ్చెన్నయుడిపై ఫైర్‌

మాజీ మంత్రి, వైసీపీ(YSRCP) సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y. S. Rajasekhara Reddy) గురించి టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బొత్స కన్నీరు పెట్టుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాజకీయాల కోసం ఇంత నీచమా?
మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) చేస్తున్న వ్యాఖ్యలపై బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “పదవుల కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. రాజకీయం చేయాలంటే దమ్ముంటే ప్రజలకు న్యాయం చేసి చూపించు. కానీ, చనిపోయిన మహానేత వైఎస్సార్‌ను రాజకీయంలోకి లాగడం నీ నీచ బుద్ధికి నిదర్శనం” అంటూ విరుచుకుపడ్డారు. వైఎస్సార్ గురించి అచ్చెన్నాయుడు తప్పుగా మాట్లాడబట్టే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

వైఎస్సార్ మరణం – నాటి నిజాలు
వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన పరిణామాలపై బొత్స కీలక విషయాలను వెల్లడించారు. “రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్ (Y. S. Jagan Mohan Reddy) హైదరాబాద్ లోనే ఉన్నారు. నేను, నా భార్య కలిసి క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్‌ను తీసుకుని వచ్చాం.” సంతకాలతో సంబంధం లేదు: వైఎస్ మరణం తర్వాత జరిగిన సంతకాల వ్యవహారానికి జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని బొత్స తేల్చి చెప్పారు. ఈ విషయం రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణలకు కూడా తెలుసని ఆయన స్ప‌ష్టం చేశారు.

డైవర్షన్ పాలిటిక్స్.. వ్యక్తిగత దూషణలు
ప్రస్తుతం వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) ప్ర‌తిపాదించిన అంశానికి వస్తున్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేకనే టీడీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బొత్స ఆరోపించారు. “ఇంట్లో ఉన్న ఆడవాళ్ల గురించి మాట్లాడటం మీ సంస్కారమా? అచ్చెన్నాయుడు సభ్యత, సంస్కారం లేని వ్యక్తి. నన్ను వ్యక్తిగతంగా ఏమన్నా నేను బాధపడను, కానీ వైఎస్సార్‌ను, కుటుంబాల‌ను కించపరిస్తే సహించం” అని హెచ్చరించారు.

“మావిగన్ (Mavigan) గురించి మాట్లాడుతుంటే ఎందుకు అంత ఉలిక్కిపడుతున్నారు? మా చరిత్ర ఏమిటో మీకు తెలుసు, మీ చరిత్ర ఏమిటో మాకు తెలుసు” అంటూ బొత్స పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్‌తో తమ కుటుంబానికి విడదీయరాని సంబంధం ఉందని, అలాంటి నాయకుడిపై బురదజల్లడం మానుకోవాలని బొత్స హితవు పలికారు.

Join WhatsApp

Join Now

Leave a Comment