హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఇటీవల జరిగిన మొహర్రం (Moharram), బోనాల (Bonalu) ఊరేగింపుల్లో కొందరు పోకిరీలు హద్దు మీరారు. గుంపులో ఎవరూ చూడట్లేదనే ధీమాతో మహిళలు, యువతులను (Young Women) విచక్షణారహితంగా, అనుచితంగా తాకుతూ వేధించారు (Harassed). అయితే, షీ-టీమ్స్ (SHE Teams) నిఘాలో మొత్తం 478 మంది పోకిరీలు పట్టుబడ్డారని డీసీపీ (DCP) డాక్టర్ ఎన్‌జేపీ లావణ్య(Dr. NJP Lavanya) మంగళవారం ప్రకటించారు.
షీ-టీమ్స్ ఈ ఆకతాయిలను పట్టుకోవడానికి రహస్య కెమెరాలను ఉపయోగించాయి. పట్టుబడిన వారిలో 386 మంది మేజర్లు, 92 మంది మైనర్లు ఉన్నారు. ఈ పోకిరీల్లో నలుగురిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మిగిలిన వారిని మందలించి పంపారు. ఈ చర్యల ద్వారా గుంపులో జరిగే ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.