ఏబీ వెంకటేశ్వరరావుకు జనసేన నేత బహిరంగ సవాల్

ఏబీ వెంకటేశ్వరరావుకు జనసేన నేత బహిరంగ సవాల్

అమరావతి రాజధాని(Amaravati Capital) అంశంపై తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని జనసేన పార్టీ (Jana Sena Party) నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetti Satyanarayana) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాజీ డీజీపీ (Former DGP) ఏబీ వెంకటేశ్వరరావు (A.B. Venkateswara Rao)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆయన, అసత్య ఆరోపణలు మానుకుని వాస్తవాలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బహిరంగ సవాల్ విసిరారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన బొలిశెట్టి, ఏబీ వెంకటేశ్వరరావు వీడియోను పోస్ట్ చేస్తూ “దమ్ముంటే నిరూపించండి.. లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పండి” అని డిమాండ్ చేశారు. “మీరు కలుగులో దాక్కున్న సమయంలో నేను ప్రజా ప్రయోజనాల కోసం పోరాడాను” అంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రాజధాని విషయంలో తన వైఖరి ఎప్పటికీ స్పష్టమేనని బొలిశెట్టి వెల్లడించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, రైతుల హక్కుల పరిరక్షణ కోసం తాను నిరంతరం నిలబడ్డానని తెలిపారు. తాను దాఖలు చేసిన కేసులు రాజకీయ ఉద్దేశాలతో కాదని, అమరావతి జరీబు భూములు, ఫ్లడ్ ప్లెయిన్స్, పర్యావరణ పరిరక్షణ కోసమేనని స్పష్టం చేశారు.

వైసీపీ పాలన సమయంలో తాను జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వ్యక్తినని, మడ అడవుల రక్షణ కోసం న్యాయపోరాటాలు చేసిన తనను జగన్ మనిషిగా చిత్రీకరించడం పూర్తిగా అవాస్తవమని ఆయన మండిపడ్డారు. పర్యావరణ పరిరక్షణ, రాజ్యాంగ విలువల రక్షణే తన ఏకైక లక్ష్యమని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని ఏబీ వెంకటేశ్వరరావును సవాల్ చేశారు. “సమయం, వేదిక మీరు నిర్ణయించండి” అంటూ బొలిశెట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment