తిరుపతి (Tirupati) జిల్లా శ్రీకాళహస్తి (Srikalahasti) ఎమ్మెల్యే (MLA) బొజ్జల సుధీర్ రెడ్డి (Bojjala Sudheer Reddy) మీడియా ప్రతినిధిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాట తీస్తా, అంతూ చూస్తా, నీ కథ ముగిసినట్టే అని మీడియా (Media)ను టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) బెదిరించిన (Threatened) సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఈయనకు ఇది కొత్తేమీ కాదు.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నియోజకవర్గంలోని వసూళ్లపై ప్రశ్నించిన టీడీపీ అనుకూల పత్రిక (ఈనాడు) రిపోర్ట్‌ను తాటతీస్తానని బెదిరించాడు. తాజాగా మరోసారి విలేఖరిపై నోరు పారేసుకున్నాడు.
నీ కథ ముగిసినట్టే..
ఇటీవల ఏర్పేడు (Yerpedu) మండలం పరిధిలోని వికృతమాల, మునగలపాళెం ప్రాంతాల్లో అక్రమంగా (Illegally) ఇసుక రవాణా (Sand Transportation) చేస్తున్నారని, ఎమ్మెల్యే అండతో కొంతమంది నేతలు ట్రాక్టర్‌కు రూ. 500 చొప్పున వసూలు చేస్తున్నారన్న వార్త టీడీపీ అనుకూల పత్రికలో ప్రచురితమైంది. ఈ కథనం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. తన పీఏ (PA) ద్వారా ఈనాడు విలేఖరి (Eenadu Journalist) కి ఫోన్ చేయించి, “నా గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాటతీస్తా. ఇదే నీకు చివరి హెచ్చరిక (Last Warning). ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో. ఇకపై వ్యతిరేక వార్త కనిపిస్తే నీ కథ ముగిసినట్టే” అంటూ తీవ్రంగా హెచ్చరించారు. విలేకరి విషయాన్ని వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగాడు. ఈ వ్యవహారం తిరుపతి జిల్లా (Tirupati District) మీడియా వర్గాల్లో (Media Circles) పెద్ద దుమారాన్నే రేపుతోంది. ప్రజాప్రతినిధి పదవిలో ఉన్న వ్యక్తి ఈ తరహా ధోరణి అవలంబించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైలుపట్టాలపై పడుకోబెడతా.. గుమ్మనూరు
ఇటీవల గుంతకల్లు (Guntakal) టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) సైతం మీడియా ప్రతినిధులను బెదిరింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. తనపై వార్తలు రాస్తే తాట తీస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు పనిగట్టుకొని తనపై వార్తలు రాస్తున్నారని, తనపై రాసిన వార్తలను నిరూపించకపోతే రైలు పట్టాలపై పడుకోబెట్టడానికి సిద్ధంగా ఉన్నానని, తనకేం లెక్కలేదు.. అన్ని విధాలుగా చేసి వచ్చా అని బెదిరింపులకు దిగారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధులను బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.








