అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న బీజేపీ!

అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న బీజేపీ!

కాంగ్రెస్ (Congress) నాయకుడు, మాజీ క్రికెటర్ (Cricketer) మహమ్మద్ అజారుద్దీన్‌ (Mohammad Azharuddin)కు మంత్రి పదవి  (Minister Post) ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ(BJP) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ దక్కని అజారుద్దీన్‌కు రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అయితే, ఈ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్‌ (Election Commission)కు ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఒక వర్గం ఓట్ల కోసం అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

బీజేపీ వాదన

అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ప్రాంతంలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, వారిని ప్రభావితం చేయడానికి ఈ మంత్రి పదవిని ఆఫర్ చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేయనున్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డి, ఆంటోనీ రెడ్డి వంటి బీజేపీ నాయకులు ఈసీని కలిసి, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment