---Advertisement---

రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎంపీ ఈటల దాడి

రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎంపీ ఈటల దాడి
---Advertisement---

మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికంగా పేదల స్థలాలను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలపై, ఆయన ఆ బ్రోకర్‌ను చితకబాదారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా పేదల భూములను రియల్‌ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మాట్లాడిన ఈటల, “కొంతమంది అధికారుల సాయంతో బ్రోకర్లు పేదల స్థలాలపై కన్నేశారు. మేము చూస్తూ ఊరుకోం, బీజేపీ పేదల హక్కుల కోసం పోరాడుతుంది” అని ఈట‌ల రాజేంద‌ర్ హెచ్చ‌రించారు. పేదల జీవనానికి అవసరమైన స్థలాలను కాపాడటమే త‌మ లక్ష్యమ‌ని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామ‌న్నారు.

1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల పేదలు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇళ్లు కట్టుకొని ఉంటున్నారని, రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కి, సీపీకి, మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ వివరాలతో ఉత్తరాలు రాస్తానని ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. భూములు కొనుక్కున్న వారిది తప్పు కాదని, దొంగ కాగితాలు సృష్టించిన అధికారులది అని, వాళ్ల‌ను జైల్లో పెట్టాలని ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment