బిల్ క్లింటన్‌కి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక‌

బిల్ క్లింటన్‌కి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక‌

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ఆయనను వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. క్లింటన్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, ఆయన త్వరగా కోలుకుంటారని ఆయ‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిస్మస్ పండుగ కోసం ఆయన ఇంటికి తిరిగి వస్తారని సిబ్బంది తెలిపారు.

బిల్ క్లింటన్ 1993 నుండి 2001 వరకు రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా సేవలందించారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన అనేక ఆరోగ్య సమస్యలతో పోరాటం చేస్తున్నారు. 2004లో ఛాతీ నొప్పి, శ్వాసకోస సమస్యల కారణంగా నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత, 2010లో గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొన్న ఆయన మరోసారి శస్త్రచికిత్స చేసుకుని, రెండు స్టెంట్లు వేసుకున్నారు.

2021లో కూడా ఆయన మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటికే, డెమోక్రట్ల తరఫున అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొని, తన కార్యకలాపాలతో ప్రజలను ఆకట్టుకున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment