బిహార్ రాష్ట్రం (Bihar State) లో ప్రకృతి భీభత్సం (Nature Havoc) సృష్టిస్తోంది. గత 48 గంటలుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించి పోయింది. ఆకస్మికంగా వచ్చిన ఈ వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 19 మంది (19 people) ప్రాణాలు కోల్పోయారు (Lost Their Lives). బెగుసరాయ్, దర్భంగా, మధుబని, సహర్సా, సమస్తిపూర్ జిల్లాల్లో అత్యధిక మృతుల సంఖ్య నమోదైంది.
చాలా మంది పిడుగుపాటుకు (Lightning Strikes) బలయ్యారని అధికారులు వెల్లడించారు. పలు చోట్ల వర్షాల (Rains) కారణంగా పంట నష్టం (Crop Damage) తీవ్రమైందిగా సమాచారం. ముఖ్యంగా గోధుమ, మామిడి పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) స్పందించారు. ప్రాణనష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా (Ex-Gratia) ప్రకటించారు. పంటనష్టం అంచనా వేసి రైతులకు సహాయం అందించేందుకు అధికారులను ఆదేశించారు.
ఇక వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, ఏప్రిల్ 12 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్ళు మరియు బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దర్భంగా, సమస్తిపూర్, మధుబని, ముజఫర్‌పూర్, సీతామరి, శిభార్, తూర్పు చంపారన్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించింది.