బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ రేపుతున్న బిహార్ (Bihar) అసెంబ్లీ (Assembly) ఎన్నికల (Elections) పూర్తి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)(EC) తాజాగా ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం (అక్టోబరు 6న) 4 గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 243 మంది సభ్యులు కలిగిన బీహార్ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 22తో ముగుస్తుంది. రెండు విడతల్లో ఎన్నిలకలు నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపారు. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ పోలింగ్,11న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తొలిదశ పోలింగ్ కు ఈ నెల 10న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నవంబర్ 14న కౌంటింగ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు.


బిహార్‌ రాష్ట్రంలో మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) వెల్లడించారు. ఈ ఓటర్లలో వివిధ వర్గాల గణాంకాలు ఇలా ఉన్నాయి:

పురుషులు: 3.92 కోట్లు మంది

మహిళలు: 3.20 కోట్లు మంది

దివ్యాంగులు (PWDs): 7.2 లక్షలు మంది

తొలిసారి ఓటర్లు: 14.01 లక్షల మంది

వయోవృద్ధులు (85+): 4.04 లక్షలు

శతాధిక వృద్ధులు (100+): 14,000 మంది

ట్రాన్స్‌జెండర్: 1,725 మంది

ఛట్ పూజ, ఓటర్ల జాబితా అంశాలు
ఛట్ పూజ: ఛట్ పూజ పండుగ ముగిసిన వెంటనే పోలింగ్ నిర్వహించాలని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు, అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను నవంబర్ మధ్యలో రూపొందించినట్లు సీఈసీ తెలిపారు.

ఓటరు నమోదు: నామినేషన్ల ప్రక్రియకు 10 రోజుల ముందు వరకు కూడా ఓటర్లు తమ పేర్లను జాబితాలో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తుది ఓటర్ల జాబితా ప్రకటన ఆగస్టు 1న జరిగింది.

ఈ ఎన్నికల షెడ్యూల్‌తో బిహార్‌లో రాజకీయ వేడి మొదలైంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు త్వరలో ప్రచారం మొదలుపెట్టనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment