ఐపీఎల్(IPL) 2025 సందడి ముగిసి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ(RCB) విజేతగా చరిత్ర సృష్టించిన వేళ, ఇప్పుడు బుల్లితెరపై తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 (Bigg Boss Season 9) సందడి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. వివాదాలు, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన ఈ రియాలిటీ షో తెలుగు టీవీ (Telugu TV)లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. 2017లో ప్రారంభమైన ఈ షో ఇప్పటివరకు 8 సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్ నవ్వులు, భావోద్వేగాలు, గేమ్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా బిగ్‌బాస్ షో (Bigg Boss Show) భారీ విజయం సాధిస్తోంది. సీజన్ 9పై ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ నెలకొంది, రోజూ కొత్త అప్‌డేట్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఈ సీజన్‌లో కొత్త కాన్సెప్ట్‌లు, ట్విస్ట్‌లతో ప్రేక్షకులకు భిన్నమైన అనుభవాన్ని అందించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మూడో సీజన్ నుంచి తనదైన శైలిలో హోస్టింగ్‌తో ఆకట్టుకుంటున్న నాగార్జున (Nagarjuna) ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా కొనసాగనున్నారని తెలుస్తోంది. గతంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ (Hosts)గా వ్యవహరిస్తారనే పుకార్లు వచ్చినప్పటికీ, నాగార్జునే ఈ సీజన్‌ను నడిపించనున్నారు.
సమాచారం ప్రకారం, నాగార్జునకు ఈ సీజన్ కోసం రూ.30 కోట్లకు పైగా పారితోషికం ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ సీజన్ ఆగస్టు లేదా సెప్టెంబర్ 2025లో ప్రారంభం కానుంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్ల ప్రకారం, కుమారి ఆంటీ, బమ్ చిక్ బబ్లూ, రమ్య మోక్ష వంటి ప్రముఖులు ఈ షోలో పాల్గొనే అవకాశం ఉందని టాక్. ఈ సీజన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.







