బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 (Bigg Boss Tamil Season 9) గ్రాండ్ ఫినాలే జనవరి 18న ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. చివరి క్షణాల వరకు ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచిన ఈ ఫినాలేలో దివ్య గణేష్ (Divya Ganesh) విజేతగా నిలిచి బిగ్ బాస్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సీజన్‌లో శబరి (Sabari) తొలి రన్నరప్‌గా, వికెల్స్ విక్రమ్ (Vikels Vikram) రెండో రన్నరప్‌గా నిలిచి ప్రశంసలు అందుకున్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన దివ్య గణేష్, ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే వారం వారం ఆమె ఆటతీరు, టాస్క్‌లలో అనుసరించిన వ్యూహాలు, హౌస్‌మేట్స్‌తో వ్యవహరించిన తీరు ప్రేక్షకులను క్రమంగా ఆకట్టుకున్నాయి. ప్రతి టాస్క్‌లో తనదైన స్ట్రాటజీతో ముందుకెళ్లి, బలమైన కంటెస్టెంట్‌గా ఎదిగి చివరకు టైటిల్‌ను సొంతం చేసుకుంది.
దివ్య గణేష్‌కు ఇప్పటికే సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా తమిళంలో ప్రసారమైన ‘భాగ్యలక్ష్మి’ సీరియల్‌లో జెన్నీ పాత్రలో ఆమె చేసిన నటనకు మంచి స్పందన లభించింది. అదే ఇమేజ్‌ను బిగ్ బాస్ హౌస్‌లోనూ కొనసాగిస్తూ అభిమానులను సంపాదించుకుంది. ఈ సీజన్‌లో ఆమె ప్రదర్శించిన ధైర్యమైన ఆటతీరుకు ప్రేక్షకులు ప్రేమతో ‘లేడీ టైగర్’ (Lady Tiger) అనే బిరుదు పెట్టారు.
వైల్డ్ కార్డ్ (Wild Card)గా వచ్చి చివరకు విన్నర్‌గా నిలవడం అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ తమిళ సీజన్ 9 అక్టోబర్ 5, 2025న ప్రారంభమై జనవరి 18, 2026న ముగిసింది. మొదట్లో విమర్శలు ఎదురైనా, చివరికి ప్రేక్షకులను మెప్పించి మంచి టీఆర్పీ సాధించింది. సీజన్ 9 టైటిల్ గెలిచిన దివ్య గణేష్‌కు రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేశారు.








