వరుస దారుణాలు.. టీటీడీ ప్రతిష్టను మంటగలిపేలా ‘కూట‌మి’ చర్యలు

వరుస దారుణాలు.. టీటీడీ ప్రతిష్టను మంటగలిపేలా 'కూట‌మి' చర్యలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ రాజ‌గోపురంపై మందుబాబు వీరంగం సృష్టించిన ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘటనను “”గా అభివర్ణించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ప్రతిష్టను పూర్తిగా మంటగలిపేలా చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆలయాల పరిరక్షణకు చంద్ర‌బాబు ప్రభుత్వం, టీటీడీ పాలకులు ఏమీ చేయడం లేదని విమర్శించారు. ఈ మేర‌కు భూమ‌న వీడియో విడుద‌ల చేశారు.

టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు వీఐపీ సేవల్లోనే తరిస్తూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని భూమన ఆరోపించారు. సాక్షాత్తు శ్రీ‌వెంకటేశ్వర స్వామి సోదరుడైన శ్రీ‌గోవిందరాజస్వామి ఆలయంలో ఒక తాగుబోతు గోపురంపైకి ఎక్కి కలశాలను ధ్వంసం చేస్తూ “మందు కావాలి” అని డిమాండ్ చేయడం భద్రత ఎంత డొల్లత‌నంగా మారిందో స్పష్టం చేస్తోందన్నారు. ఈ ఘటనలో సంబంధిత వ్యక్తి పవన్ నంద స్వామి (ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) వీరాభిమాని అని ప్రచారం జరుగుతోందని కూడా చెప్పారు.

తిరుమల కొండపై మద్యం, మాంసం విచ్చ‌ల‌విడిగా దొరుకుతోందని భూమన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల సంఖ్య ఎందుకు తగ్గిందన్న దానిపై ఎలాంటి సమీక్ష జరగలేదని, బీ.ఆర్. నాయుడు శ్రీ‌వారి దర్శనాల చిట్టాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సీఎంవో నుంచి వచ్చే సిఫార్సు లేఖలకే దర్శనాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. భక్తుల గోడును పట్టించుకునే పరిస్థితి టీటీడీ పాలకుల్లో కనిపించడం లేదని మండిపడ్డారు.

ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకోవడం రాష్ట్ర చరిత్రలో, టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి అని, ఇది మరింత దారుణమని భూమన విమర్శించారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి బరి తెగింపు జరిగేలా పరిస్థితులు కల్పిస్తున్నారని, తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన ఘటన ఆలయ వ్యవస్థల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment