తిరుమల (Tirumala) శ్రీవారి (Sri Vari) కొండ (Hill) కు వెళ్లే అలిపిరి (Alipiri) పాదాల చెంత వద్ద విగ్రహం (Idol) నిర్లక్ష్యం పడేసిన (Neglect Thrown) ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అది శనేశ్వర విగ్రహం (Lord Shani Idol) అని అధికార పార్టీ నేతలు భూమన (Bhumana) వ్యాఖ్యలను ఖండిస్తుండగా, అది ముమ్మాటికీ శ్రీ మహా విష్ణువు విగ్రమేనని కరుణాకర్‌రెడ్డి (Karunakar Reddy) స్పష్టం చేస్తున్నారు. అది శనేశ్వరస్వామి విగ్రహం అయినా, మహా విష్ణువు విగ్రహం అయినా హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అంటున్నారు శ్రీవారి భక్తులు.
ఇదిలా ఉండగా, టీటీడీ(TTD) బోర్డ్ సభ్యులు చేస్తున్న విమర్శలపై భూమన కరుణాకరరెడ్డి మళ్లీ స్పందించారు. ఈ అంశంపై తాను చేసిన వ్యాఖ్యలపై అసత్యాలు ప్రచారం చేస్తూ, తప్పుడు కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “అది శనేశ్వర విగ్రహం అని కొందరు చెబుతున్నారు. కానీ శంకు, చక్రాలు ధరించిన విగ్రహం ఎలా శనేశ్వర విగ్రహం అవుతుంది? శనేశ్వర విగ్రహానికి విల్లు, బాణం ఉంటాయి. కాబట్టి ఇది ముమ్మాటికీ శ్రీమహావిష్ణువు విగ్రహమే. అది శిల్పి చెక్కిపడేశాడని చెప్పడం నిర్లక్ష్యపు సమాధానం తప్ప మరొకటి కాదు” అని భూమన స్పష్టం చేశారు.
“నాపై తప్పుడు కేసులు పెట్టినా, జైలులో వేసినా నేను నిజం చెబుతూనే ఉంటాను. నేను నాయకుడి కంటే ముందు.. స్వచ్ఛమైన హిందువును. హిందూ ధర్మంపై నాకున్న నమ్మకమే నాకు బలం. స్వామి అనుగ్రహంతోనే రెండుసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా, మూడు సార్లు బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది. హిందూ ధర్మ పరిరక్షణే నా ముఖ్య ధ్యేయం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత పాలక మండలి ఏడాదిన్నర కాలంగా ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన, అలిపిరి వద్ద విగ్రహం నిర్లక్ష్యం వ్యవహారంపై మరింత స్పష్టత ఇవ్వాలని కోరారు. “రాజకీయాల కంటే హిందూ ధర్మ పరిరక్షణే నాకు ముఖ్యం” అని భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు.








