ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా (Bharathiraja) కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా (Manoj Bharathiraja) (48) మంగళవారం గుండెపోటు (Heart Attack) తో కన్నుమూశారు. ఛాతి నొప్పితో నెల క్రితం సిమ్స్ ఆసుపత్రి (SIMS Hospital) లో చేరిన మనోజ్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ (Discharged) అయ్యాక ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మంగళవారం ఉదయం మరోసారి ఛాతినొప్పి రావడంతో ఆయన హఠాన్మరణం (Sudden Death) చెందారు.
మనోజ్ భారతీరాజా 1976 సెప్టెంబర్ 11వ తేదీన జన్మించారు. హీరోగా, నటుడిగా పలు సినిమాల్లో నటించారు. తన కుమారుడు మనోజ్‌ను హీరోగా తాజ్ మహల్ (Taj Mahal) అనే సినిమాతో కోలీవుడ్ పరిశ్రమకు భారతీరాజా పరిచయం చేశారు. మనోజ్ మృతితో భారతీరాజా కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సానుభూతి (Condolences) తెలియజేస్తున్నారు.