భద్రాద్రి కొత్తగూడెంలో భవనం కూలి ఏడుగురు మృతి

భద్రాద్రి కొత్తగూడెంలో భవనం కూలి ఏడుగురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం (Panchayati Office) సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. భ‌వ‌నం కూలిపోయిన‌ప్పుడు అందులో కూలీలు (workers) ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంతో ఒక్క‌సారిగా స్థానికులంతా ఉలిక్కిప‌డ్డారు. స‌మీప నివాసితులంతా భారీ శ‌బ్దం రావ‌డంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు (police) సహాయక చర్యలు (rescue operations) చేప‌ట్టారు. ఈ ప్ర‌మాదం అనంత‌రం ఇంటి యజమాని (house owner) శ్రీపతి శ్రీనివాసరావు (Sripathi Srinivasa Rao) పరార్ అయినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ భ‌వ‌నం నిర్మిస్తున్నార‌ని నాసిరకమైన మెటీరియ‌ల్‌ (substandard material) తో పిల్లర్ల (pillars) నిర్మాణం చేపట్టారని భద్రాచలం ఐటీడీఏ (ITDA) ప్రాజెక్టు అధికారికి స్థానికంగా ఉన్న ప‌లువురి నుంచి ఫిర్యాదులు అందాయి. ఐటీడీఏ అధికారి ఆ భవనాన్ని కూల్చివేయమని పంచాయతీ శాఖ (Panchayati Department) కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను బేఖాతార్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి పలువురు మరణానికి కారణమైందని టాక్ వినిపిస్తోంది.

భ‌వ‌నం కూలిపోయి ఏడుగురు మృతిచెంద‌డంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. మృతుల కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని ప‌లువురు డిమాండ్ (demand) చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment