బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. సిట్ విచారణలో ప్రముఖులు

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. సిట్ విచారణలో ప్రముఖులు

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు (Betting Apps Promotion Case) రోజురోజుకూ సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT: Special Investigation Team) పలువురు ప్రముఖులను విచారిస్తోంది. నిన్న, యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మరియు యూట్యూబర్, నటి సిరి హనుమంతు (Siri Hanumanth) సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. విజయ్ దేవరకొండను అధికారులు సుమారు రెండు గంటలపాటు, సిరి హనుమంతును నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం వారు అందుకున్న మొత్తాల గురించి, ఆ డబ్బు అందిన విధానం, ఆన్‌లైన్ బెట్టింగ్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల గురించి అధికారులు వివరంగా ఆరా తీశారు. సిట్ బృందం ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరిస్తోంది. డబ్బు మూలాలు, జమ అయిన ఖాతాలు, అలాగే ఈ అక్రమాలకు వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.

ఈ దర్యాప్తులో భాగంగా, నేడు (బుధవారం) సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఆయన్ను కూడా ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేసిన వారిలో ఒకరిగా భావిస్తున్నారు. ఈ రోజు ఆయనను విచారించి, సంబంధిత వివరాలను సిట్ అధికారులు సేకరించనున్నారు. ఈ కేసును తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రముఖుల ప్రమోషన్ల వెనుక దాగి ఉన్న అసలు ముఠాలను బయటకు తీసే దిశగా తమ దర్యాప్తును వేగవంతం చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment