బెంగళూరు (Bengaluru) నగరంలో ఇటీవల చోటుచేసుకున్న మహిళలపై లైంగిక వేధింపుల (Sexual Harassment) ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నగరంలోని BTM లేఅవుట్ ప్రాంతంలో ఇద్దరు మహిళలు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో, ఓ వ్యక్తి వారిని అనుసరిస్తూ వచ్చాడు. అంతేకాకుండా, వారిలో ఒకరిపై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీల్లో(CCTV Cameras) రికార్డయ్యాయి. అనంతరం అతను అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, రాష్ట్ర హోంమంత్రి (Home Minister) జి. పరమేశ్వర (G. Parameshwara) చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. “పెద్ద నగరాల్లో ఇలాంటి ఘటనలు సాధారణమే” అని ఆయన వ్యాఖ్యానించడంతో, బీజేపీ (BJP) సహా పలువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన అనంతరం, పరమేశ్వర క్షమాపణలు (Apology) తెలిపారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని స్పష్టం చేశారు.
మూడు రాష్ట్రాల్లో వేట.. 700 సీసీటీవీల విశ్లేషణ
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 700 సీసీటీవీల ఫుటేజీని పరిశీలించి, చివరకు అతన్ని గుర్తించారు. నిందితుడు 26 ఏళ్ల సంతోష్ (Santosh)గా గుర్తించారు. బెంగళూరులోని జాగ్వార్ షోరూం (Jaguar Showroom) లో డ్రైవర్ (Driver)గా పనిచేస్తున్న అతడు, ఘటన అనంతరం హోసూరుకు పారిపోయాడు. అక్కడి నుంచి సేలం, అనంతరం కోజికోడ్‌కి వెళ్లి, చివరికి కేరళ (Kerala) లోని ఓ మారుమూల గ్రామంలో పోలీసుల (Police) చేతిలో పట్టుబడ్డాడు (Caught). పోలీసులు మూడు రాష్ట్రాల్లో వారం రోజులపాటు నిందితుడి కోసం వేట కొనసాగించారు.








