బెంగళూరు తొక్కిసలాట.. ఆర్సీబీ ఆర్థిక సాయం ప్రకటన‌

బెంగళూరు తొక్కిసలాట.. ఆర్సీబీ ఆర్థిక సాయం ప్రకటన‌

ఐపీఎల్-18 (IPL-18) విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ స‌భ మిగిల్చిన విషాదం నుంచి కొన్ని కుటుంబాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. చిన్నస్వామి (Chinnaswamy) స్టేడియం (Stadium)లో నిర్వహించిన విక్టరీ పరేడ్‌ (Victory Parade)కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే అక్కడ ఏర్పడిన తొక్కిసలాట పెద్ద విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో పలువురు దుర్మరణం పాలవ్వగా, కొందరు గాయపడ్డారు. ఈ తొక్కిస‌లాట (Stampede) ఘ‌ట‌న‌లో దుర్మ‌ర‌ణం చెందిన కుటుంబాల‌కు ఆర్సీబీ(RCB) ఆర్థిక సాయం (Financial Assistance) ప్ర‌క‌టించింది.

RCB ఆర్థిక సాయం నిర్ణయం
ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన RCB యాజమాన్యం, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఫ్రాంచైజీ హామీ ఇచ్చింది. అదే సమయంలో గాయపడిన అభిమానుల చికిత్సకు అవసరమైన సహాయం అందజేస్తామని RCB స్పష్టం చేసింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి టైటిల్ గెలిచిన సంతోషం కాసేపు కూడా నిలవకముందే ఈ విషాదం చోటుచేసుకోవడం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment