మెట్రో స్టేష‌న్‌లో ఏంటీ పాడు ప‌ని.. యువ జంట వీడియో వైర‌ల్‌

బెంగళూరు మెట్రో స్టేషన్‌లో జంట వికృత చేష్టలు.. వీడియో వైర‌ల్‌

బెంగళూరు మెట్రో స్టేషన్‌ (Bengaluru Metro Station) లో ఓ యువ జంట (Young Couple) ప్రవర్తన చూసి నెటిజన్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఓ యువకుడు తన స్నేహితురాలితో కలిసి ప‌బ్లిక్ ప్లేస్‌లో అసభ్యకరంగా (Indecently) ప్రవర్తించాడు. ఈ సంఘ‌ట‌న మెజెస్టిక్ మెట్రో స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ 3లో జరిగింది.

ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న జంట హద్దులు మీరి ప్ర‌వ‌ర్తించింది. యువకుడు ఆమె దుస్తులను పైకి లేపుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. చుట్టూ ఉన్న మహిళలు, వృద్ధులు, చిన్నారులను పట్టించుకోకుండా ట్రైన్ వచ్చేంతవరకూ అదే ప్రవర్తన కొనసాగించాడు. ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది ఈ దృశ్యాలను మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలు (Videos) నెట్టింట్లో వైరల్ (Viral) కావడంతో, నెటిజన్లు మండిపడుతున్నారు. “ఇదేం చేష్టలు? పార్కులు, లాడ్జీలు ఉండగా మెట్రో స్టేషన్‌ లోకే వస్తారా?” అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండు చేస్తున్నారు.

అధికారుల స్పందన
ఈ ఘటనపై ఐబీఎంఆర్‌సీఎల్ (BMRCL) పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ బీఎల్.యశ్వంత్ చవాన్ (B.L. Yashwanth Chavan) స్పందించారు. “ఆ జంట అలా ప్రవర్తిస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు ఏమి చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. వీడియో తీయడానికి ముందు వారిని హెచ్చరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భద్రతా సిబ్బందికి ఆ జంటపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment