బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట.. హైకోర్టు స్టే

బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట.. హైకోర్టు స్టే

2024లో దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన బెంగ‌ళూరు డ్ర‌గ్స్ కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో నటి హేమకు హైకోర్టు ఊరట ఇచ్చింది. ఆమెపై నమోదైన కేసుకు బెంగళూరు హైకోర్టు స్టే విధించింది. హేమ తనపై డ్రగ్స్ కేసు కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆమె త‌న పిటిషన్‌లో తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

పార్టీ, పోలీసు విచారణలపై హేమ వివరణ
గతేడాది బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీకి హాజరైన తెలుగు సెలబ్రిటీలందరికీ డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో నటి హేమ కూడా ఉండటం కలకలం రేపింది. కానీ, హేమ తనకు తగినట్లుగా వివరణ ఇచ్చారు, “తాను రేవ్ పార్టీకి హాజరుకాలేదు” అంటూ ఒక వీడియో విడుదల చేశారు. దీనికి కౌంట‌ర్‌గా బెంగళూరు పోలీసులు ఆమె ఫొటో విడుదల చేసి, “కృష్ణవేణి” అనే పేరుతో ఆమె ఆ పార్టీకి హాజరైనట్లు వెల్లడించారు.

కోర్టు స్పందన
ఈ విషయంపై హేమ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, న్యాయస్థానం విచారణపై స్టే విధించింది. దీంతో ప్రస్తుతం ఆమెకు డ్ర‌గ్స్ కేసులో ఊరట లభించినట్లైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment