రోహిత్-కోహ్లీలకు బీసీసీఐ షాక్

రోహిత్-కోహ్లీలకు బీసీసీఐ షాక్

టీమిండియా (Team India) సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)ల వన్డే (ODI) భవితవ్యంపై బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. టీ20, టెస్టు ఫార్మాట్ల నుంచి ఇప్పటికే తప్పుకున్న రో-కోలు ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్‌కు మాత్రమే పరిమితమయ్యారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన ఈ ఇద్దరికీ మ్యాచ్ ఫిట్‌నెస్ సమస్య ప్రధానంగా మారడంతో, వన్డేల్లో కొనసాగాలంటే తప్పనిసరిగా దేశవాళీ టోర్నమెంట్లలో ఆడాలని బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీతో పాటు, నవంబర్ 26 నుంచి మొదలయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో కూడా ఆడటానికి రోహిత్ శర్మ సుముఖత వ్యక్తం చేసినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి తెలియజేశాడు. మరోవైపు, విరాట్ కోహ్లీ నుంచి మాత్రం ఈ మేరకు బీసీసీఐకి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. కోహ్లీ చివరగా 2010లో ఢిల్లీ తరఫున దేశవాళీ మ్యాచ్ ఆడాడు.

దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 3 నుంచి 9 వరకు జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించనప్పటికీ, ఈ ఇద్దరు దిగ్గజాలు 2027లో దక్షిణాఫ్రికాలో జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డే సిరీస్‌లో రోహిత్ హాఫ్‌ సెంచరీ, సెంచరీతో రాణించగా, విరాట్ కోహ్లీ రెండు డకౌట్‌ల తర్వాత అద్భుతంగా పుంజుకుని 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment