సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ (59) తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. రష్యా రాజధాని మాస్కోలో ఆయనపై విషప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తీవ్ర దగ్గుతో పాటు ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు తలెత్తడంతో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షలలో విషం గుర్తించబడింది, కానీ రష్యా ప్రభుత్వం ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు.
రెబల్స్ చాపకింద నీరులా..
2024 డిసెంబర్ 8న, సిరియాలో తిరుగుబాటుదారులు డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవడంతో అసద్ తన కుటుంబంతో కలసి రష్యాకు పారిపోయారు. ప్రస్తుతం రాజకీయ శరణార్థిగా మాస్కోలో నివసిస్తున్నారు. అంతేకాదు, ఆయన భార్య అస్మా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతుండడం పరిస్థితిని మరింత సంక్లిష్టం మార్చింది.
అస్మా ఆరోగ్యం గణనీయంగా క్షీణించడంతో ఆమె యూకేకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. భర్తకు విడాకులు ఇచ్చి స్వదేశానికి వెళ్లే అవకాశాలపై వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసద్ ఆరోగ్యం విషయంలో విషప్రయోగం అనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి.