బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణా గుట్టు రట్టు అయ్యింది. హైదరాబాద్ నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నిర్వహించిన దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. నగరంలోని బండ్లగూడలో నమోదైన కేసు నేపథ్యంలో ED అధికారులు అనుమానాస్పద ఆస్తులను అటాచ్ చేశారు. ఈ దాడుల్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అక్రమ రవాణా ఎలా జరుగుతోంది?
బ్యూటిషన్, టైలరింగ్ లాంటి వృత్తుల పేరిట హైదరాబాద్‌కు వచ్చిన బంగ్లాదేశ్ యువతులు.. వ్యభిచారం చేస్తోన్నట్టు విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో ఈ అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన మూడు కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఈ దాడుల్లో 20 మంది బంగ్లాదేశ్ యువతులను పోలీసులు అరెస్టు చేశారు.
బంగ్లా ముఠా రహస్యాలు బయటకు
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో అడ్డాలుగా మార్చిన ఇళ్లను గుర్తించిన అధికారులు, అక్రమ రవాణా ముఠా కార్యకలాపాలను బహిర్గతం చేశారు. ఈ ముఠాలో భాగంగా బంగ్లాదేశ్ యువకులు ఓలా, ఉబర్ డ్రైవర్లుగా పని చేస్తూ యువతులను చెరబట్టి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ యువతులు ఇండియాకు వచ్చి ఆధార్ కార్డులను సంపాదించి భారత పౌరులుగా చలామణి అవుతున్నారు. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలను వెలికితీసే పనిలో పోలీసులు, ED అధికారులు నిమగ్నమయ్యారు.