‘వాట్సాప్.. వాట్సాప్’ కాదు.. ఆ హీరోపై బండ్ల గణేష్ ఫైర్‌!

వాట్సాప్ కాదు, కష్టమే ముఖ్యం: ఆ హీరోపై బండ్ల గణేష్ ఫైర్‌!

నిర్మాత బండ్ల గణేష్, యువ హీరో కిరణ్ అబ్బవరం సినిమా ‘K-ర్యాంప్’ విజయోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో కలకలం సృష్టించాయి. సినిమా విజయం కసి, కష్టం, నిజాయితీ వల్లే వస్తుందని స్పష్టం చేస్తూ “కసితో కష్టపడితే హిట్లు వస్తాయి… ‘వాట్సాప్ వాట్సాప్’ అంటే రావు. వాస్తవానికి దగ్గరగా ఉంటూ, ప్రతిభను స్క్రీన్ పైనే చూపించాలి” అని ఉద్వేగంగా మాట్లాడారు.

ఒక్క హిట్ కొట్టగానే కొందరు హీరోలు ‘లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు’ వేసుకుని, అర్ధరాత్రి కళ్లద్దాలు పెట్టుకుని పెద్ద స్టార్స్‌లా ప్రవర్తిస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా, కిరణ్ అబ్బవరంలాగా కొత్త దర్శకులను ప్రోత్సహించే ధైర్యం ఉండాలని, కానీ కొందరు హీరోలు పెద్ద డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘గబ్బర్ సింగ్’ గురించి ప్రస్తావిస్తూ “ఒక్క హిట్టు కొడితే… నేను వెయ్యి కోట్లు ఇస్తా. నాకు గబ్బర్ సింగ్ ఇవ్వండి” అంటూ దానికి దమ్ముతో పాటు దేవుడి దయ కూడా అవసరమని సవాల్ విసిరారు. బండ్ల గణేష్ ఏ హీరో పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన చేసిన “వాట్సాప్”, “లూజు ప్యాంట్లు” వ్యాఖ్యలు, తరచుగా అదే తరహా స్టైల్‌ను అనుసరించే యువ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించేనని సినీ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది. బండ్ల గణేష్ పై విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment