బ‌న‌క‌చ‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌లేం.. ఏపీకి కేంద్రం షాక్‌

బ‌న‌క‌చ‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌లేం.. ఏపీకి కేంద్రం షాక్‌

ఎన్డీయే (NDA)లో భాగ‌స్వామిగా ఉన్న ఏపీ ప్ర‌భుత్వానికి (AP Government) కేంద్రం (Central Government) నుంచి చేదు వార్త (Bad News) ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla) ప్రాజెక్ట్‌ (Project)కు కేంద్ర ప్రభుత్వం అనుమ‌తులు నిరాక‌రించింది. ఏపీ ప్ర‌భుత్వం కోరిన‌ట్లుగా బనకచర్ల ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్‌పై అనేక అభ్యంతరాలు వచ్చాయని, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) 1980 తీర్పును ఉల్లంఘించే అవకాశం ఉందని కమిటీ తెలిపింది. అనుమతులు ఇవ్వాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)తో సంప్రదించడం తప్పనిసరని, అలాగే GWDT అవార్డును జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను గోదావరి నది వరద నీటిని ఉపయోగించి రాయలసీమకు తరలించేందుకు ప్రతిపాదించింది. అయితే, GWDT-1980లో వరద నీళ్లు, అధిక నీళ్ల గురించి ఎటువంటి కేటాయింపులు లేవని, ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్-2014 నిబంధనలను కూడా ఉల్లంఘిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. అదే విధంగా ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ సైతం బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును త‌ప్పుబ‌డుతూ, కాంగ్రెస్‌ (Congress), టీడీపీ (TDP) ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. బనకచర్ల ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (PFR)ను తిరస్కరించాలని, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సమర్పణను అడ్డుకోవాలని తెలంగాణ ప్ర‌భుత్వం కోరింది.

కేంద్ర నిపుణుల కమిటీ ఈ ప్రాజెక్ట్‌పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, పర్యావరణ అనుమతులను తిరస్కరించింది. ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇవ్వడానికి ముందు CWCతో సంప్రదింపులు, GWDT నిబంధనల పరిశీలన అవసరమని కమిటీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి ఊరటనిచ్చినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తిరస్కరణపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నా, బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి పొందలేకపోవ‌డం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment