తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య సాగుతున్న జలవివాదాల (Water Disputes) నేపథ్యంలో సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం(CM) చంద్రబాబు (Chandrababu)పై కీలక వ్యాఖ్యలు చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తికాని స్థితిలో, కొత్తగా బనకచర్ల ప్రాజెక్టును ఎలా చేపడతారని ప్రశ్నించారు.
శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. “బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ప్రస్తుతానికి అత్యవసరమయినది కాదు. మొదటగా పూర్తికాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. బనకచర్ల గురించి చంద్రబాబు ఎంతో అతిగా మాట్లాడారు. కాంట్రాక్టర్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలసి కట్టతామని చెప్పిన ప్రాజెక్టు ఇది. ఇది రూ.80 వేల కోట్లది కాదు.. అసలు రూ.2 లక్షల కోట్ల వరకు ఖర్చవుతుంది” అని అన్నారు.
అటు చంద్రబాబు మొదట తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించి ఉండాల్సిందని, అలా చేయకపోవడం వల్లే విమర్శలు వెల్లువెత్తాయని నారాయణ తెలిపారు. “ఇలాంటి నీటి ప్రాజెక్టులు ఎప్పుడూ వివాద రహితంగా ఉండాలి. రెండు రాష్ట్రాలకు గల నీటి వాటాలు తేలిన తర్వాతే కొత్త ప్రాజెక్టులపై ముందడుగు వేయాలి. నీళ్లను అడ్డుపెట్టి రాజకీయాలు చేయడం తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమే,” అంటూ నిప్పులు చెరిగారు.