‘మహానాడు’కు బాలయ్య డుమ్మా..! అసలేం జరిగింది?

'మహానాడు'కు బాలయ్య డుమ్మా..! అసలేం జరిగింది?

నంద‌మూరి తార‌క‌రామారావు (Nandamuri Taraka Rama Rao) జ‌యంతిని (Birth Anniversary) పుర‌స్క‌రించుకొని కడప (Kadapa)లో జ‌రుపుతున్న‌ మహానాడు (Mahanadu)కు ఎన్టీఆర్ సీని, రాజ‌కీయ వార‌సుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గైర్హాజరు (Absence) కావడం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మక కార్యక్రమమైన మహానాడు మంగ‌ళ‌వారం కడపలో ఘనంగా జరిగింది. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ వంటి నేతలు, కార్యకర్తలను హాజ‌రైన‌ప్ప‌టికీ.. టీడీపీ (TDP) వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ త‌న‌యుడు (NTR Son) హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం.

జూ.ఎన్టీఆర్ దూరం
నంద‌మూరి కుటుంబానికి వార‌సుడిగా అభిమానుల్లో పేరు సంపాదించుకున్న జూ.ఎన్టీఆర్ (Jr. NTR) త‌న‌ తాత స్థాపించిన టీడీపీకి ఎప్పుడో దూర‌మైపోయారు. పూర్వం ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారాలు చేసిన ఆయ‌న ఆ త‌రువాత ఒక్క‌సారిగా రాజ‌కీయ తెర‌మ‌రుగ‌య్యారు. ఆ త‌రువాత జూ.ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాలంటే అటు ఫ్యాన్స్‌, ఇటు టీడీపీలోని ఓ వ‌ర్గం నుంచి డిమాండ్లు గ‌ట్టిగానే వినిపించాయి. నారా లోకేశ్ (Nara Lokesh) కోసం జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను కావాల‌నే ప‌క్క‌న‌పెట్టార‌నే ఆరోప‌ణ‌లు కూడా వినిపించాయి. ఇప్ప‌టికీ టీడీపీలోకి జూ.ఎన్టీఆర్‌ రాక‌ను కోరుకునేవారు అనేక‌మంది ఉండ‌డం విశేషం. అయితే ఈసారి మ‌హానాడుకు జూ.ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందిస్తే వ‌స్తార‌ని అనుకున్నారు. కానీ, అభిమానుల‌కు నిరాశే మిగిలింది.

బాలకృష్ణ గైర్హాజరు కారణం
ఇప్పుడు అందరి నోటా ఒకటే ప్రశ్న – బాలయ్య ఎందుకు లేరు? ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో ముందుండే ఆయన ఈసారి కనిపించకపోవడంతో అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బాలకృష్ణ తన కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల మహానాడుకు హాజరు కాలేకపోయారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు, కార్యకర్తలు ఆయన లేని లోటును గుర్తు చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. అయినప్పటికీ, ఆయన గైర్హాజరు రాజకీయ కోణంలో ఊహాగానాలకు దారితీసింది.

సోషల్ మీడియా స్పందన
బాలకృష్ణ ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన ఈ మహానాడుకు రాకపోవడంతో, కొందరు రాజకీయ కారణాలు ఉండొచ్చని, మరికొందరు వ్యక్తిగత లేదా సినిమా షెడ్యూల్‌ల కారణంగా రాలేకపోయారని వాదిస్తున్నారు. అధికారికంగా టీడీపీ నుంచి ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో చర్చ మరింత ఊపందుకుంది. బాలకృష్ణ గైర్హాజరు సినిమా షూటింగ్‌ వల్లనే అయినప్పటికీ, రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయన ప్ర‌సంగాన్ని మిస్సయ్యామ‌ని అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment