‘జైలర్ 2’ నుండి బాలకృష్ణ ఔట్..

'జైలర్ 2' నుండి బాలకృష్ణ ఔట్..

సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘జైలర్’ (2023) సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతోంది. గతంలో ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ ఒక పవర్‌ఫుల్ పోలీస్ క్యామియో పాత్ర పోషిస్తారని, దీనికి ఆయన రూ. 50 కోట్లు తీసుకున్నారని వార్తలు వచ్చాయి.

అయితే, బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ మరియు గోపీచంద్ మలినేని సినిమాలతో బిజీగా ఉండటం వల్ల, డేట్స్ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు చెన్నై వర్గాలు సమాచారం ఇచ్చాయి. దాంతో, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, బాలయ్య చేయాల్సిన ఆ కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ను ఎంపిక చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment