అఖండ 2′ విడుదల తేదీపై బాలయ్య క్లారిటీ

అఖండ 2' విడుదల తేదీపై బాలయ్య క్లారిటీ

టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం అఖండ 2 విడుదల తేదీపై స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ లాబీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో అనధికారిక సంభాషణలో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. “ఎల్లుండి (సెప్టెంబర్ 25) తమ్ముడు పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలవుతోంది, మా అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న విడుదల అవుతుంది” అని బాలకృష్ణ పేర్కొన్నారు.

పాన్ ఇండియా స్థాయిలో ‘అఖండ 2’

‘అఖండ 2’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదల చేస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. దర్శకుడు బోయపాటి శ్రీను హిందీ డబ్బింగ్ చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పారని, అన్ని భాషల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

నిర్మాణ సంస్థ మరియు ఇతర వివరాలు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment