‘బ‌లగం’ మొగిల‌య్య క‌న్నుమూత‌

'బ‌లగం' మొగిల‌య్య క‌న్నుమూత‌

కుటుంబ సంబంధాల నేప‌థ్యంలో తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి బ‌లగం సినిమా క‌ళాకారుడు మొగిల‌య్య క‌న్నుమూశారు. ఆనారోగ్య కార‌ణాల‌తో వ‌రంగ‌ల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మొగిల‌య్య స్వ‌గ్రామం వరంగల్ జిల్లా, దుగ్గొండి.

‘బలగం’ సినిమా క్లైమాక్స్‌లో మానవ సంబంధాల ఔన్నత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తూ తోడుగా మా తోడుండి అని ఆయ‌న పాడిన పాట ప్రతి ప్రేక్షకుడి కంట నీళ్లు తెప్పించింది. ఆ గానం సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొగిలయ్య తన గాత్రం ద్వారా కళకు ప్రాణం పోసి, బుర్రకథలతో ప్రజల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇప్పుడు ఆ గాత్రం మూగబోయింది.

బలగం టీమ్ సంతాపం
క‌ళాకారుడు మొగిలయ్య అకాల మరణంపై బలగం చిత్ర దర్శకుడు వేణు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాల‌ని ఆకాంక్షించారు. మొగిలయ్య గాత్రం తెలుగువారి హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచి ఉంటుంద‌న్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment