ఆగస్టు సంక్షోభం అంటే యంగ్ జనరేషన్‌కు అసలు తెలియకపోవచ్చు. టీడీపీ (TDP)కి చంద్రబాబే (Chandrababu) వ్యవస్థాపక అధ్యక్షుడనే అభిప్రాయం ఉండొచ్చు. నటసార్వభౌముడు, పిల్లనిచ్చిన మామ కాబట్టి ఎన్టీఆర్(NTR)కు దండ వేసి దండం పెడుతున్నారని భ్రమపడుతుండొచ్చు. కనిపించేది వాస్తవం కాదు.. తెలుగు రాజకీయ చరిత్రలో ఎప్పటికీ మరవలేని సంఘటన 1995లో జరిగిన ఆగస్టు సంక్షోభం (August Crisis). ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao)కు నమ్మకస్తుడిగా ఉన్న అల్లుడు, ప్రస్తుత విభజిత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) వెన్నుపోటు (Backstabbing) రాజకీయం ఎన్టీఆర్ చరిత్ర గుర్తుచేసుకున్నంత కాలం చెరిగిపోదు.. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మలుపుగా నిలిచింది.
ఎన్టీఆర్ మాటల్లోనే…
“చంద్రబాబు నాయుడు మోసగాడు(Cheater), నయవంచకుడు (Betrayer). నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసుకున్న వాడే నన్ను మోసం చేశాడు. అధికారం కోసం తన మనసును, మానవత్వాన్ని అమ్ముకున్న వాడు. ఔరంగజేబు (Aurangzeb) తండ్రిని జైలు(Jail)లో పెట్టాడు.. అన్నల్ని చంపాడు అంటారు. అదే విధంగా నా అల్లుడు (Son-In-Law) కూడా నాపై కుట్ర పన్నాడు. చరిత్ర దీన్ని ఎప్పటికీ మరవదు” అని ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ మొదలైంది ఇలా..
సినీ నటుడిగా అప్పటికే గొప్ప పేరు సంపాదించుకున్న నందమూరి తారక రామరావు అప్పటి కాంగ్రెస్ పార్టీ అరాచాలను వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసి ఉమ్మడి ఏపీలో 294 అసెంబ్లీ సీట్లకు గానూ 201 స్థానాల్లో గెలిచి రికార్డ్ సృష్టించారు. తొలిసారిగా కాంగ్రెస్ కాకుండా అధికారంలోకి వచ్చిన నాయకుడు ఎన్టీఆర్. కానీ, ఈ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమి చవి చూశారు. ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీని వదిలి ఎన్టీఆర్ పంచన చేశారు చంద్రబాబు.
ఎలాగూ పిల్లనిచ్చిన అల్లుడు కాబట్టి పార్టీలో చేర్చుకొని ఆదరించిన ఎన్టీఆర్.. 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరిని వదిలి.. బీసీలు ఎక్కువగా ఉండే కుప్పం నియోజకవర్గం సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించగా, ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ మరియు ఫైనాన్స్ శాఖలను నారా చంద్రబాబు నాయుడుకు కట్టబెట్టారు ఎన్టీఆర్. అల్లుడు + మంత్రి కావడంతో పార్టీలోనూ చంద్రబాబు ప్రాధాన్యం క్రియాశీలకంగా మారుతూ వచ్చింది.

1994 ఎన్నికల తర్వాత ..
ఐదేళ్లు గడిచిపోయిన తరువాత మళ్లీ ఎన్నికలొచ్చాయి. 1994లోనూ తెలుగుదేశం ఘన విజయం సాధించగా ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే ముఖ్యమంత్రి కుర్చీ మీద కన్నేసిన చంద్రబాబుకు ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతీ ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో జోక్యం పెరుగుతుందన్న సాకు దొరికింది. ఆ సాకును కుటుంబ సభ్యులకు బూతంలా చూపించడంతో తిరుగుబాటుకు ప్రధాన కారణమని ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి పలు సందర్భాల్లో చెప్పడం గమనార్హం. అప్పటికే టీడీపీలోని ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతుడైన చంద్రబాబు.. అనుకూల మీడియా సహకారంతో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని రాతలు రాయించాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

1995 ఆగస్టు 26న అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడికి 294 మంది ఎమ్మెల్యేలలో 163 మంది మద్దతు ఉందని ప్రకటించారు. ఆ సభలో మాట్లాడేందుకు తనకు మైక్ కూడా ఇవ్వకుండా బయటకు గెంటేశారని ఎన్టీఆర్ భావోద్వేగం అయ్యారు. చంద్రబాబు అప్పటికే తన అనుచరులైన 152 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్‌లో సమావేశమై ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దు అభ్యర్థనను గవర్నర్ గమనించవద్దని తీర్మానం చేశారు. ఆ తీర్మాన ప్రతుల్ని గవర్నర్ బంగ్లాకు పంపించారు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకొని సెప్టెంబర్ 30న ఆయన్ను పదవీచ్యుతుడిని చేశారు.

చరిత్రాత్మక ద్రోహం
అంతిమంగా 1995 సెప్టెంబర్ 1న ఎన్టీఆర్‌ను పదవి నుంచి గెంటివేసి చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీ కైవసం చేసుకున్నాడు. వైశ్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ తాను బీఫాం ఇచ్చి తన పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలతో మాట్లాడటానికి వెళ్లినప్పుడు ఆయనపై చెప్పుల దాడి జరగడం ఆ ద్రోహానికి చిహ్నంగా నిలిచింది. తన సొంత అల్లుడు చేసిన అవమానం, కుటుంబ సభ్యుల మోసం, పార్టీ చేజారిపోవడం… ఇవన్నీ భరించలేక ఎన్టీఆర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చివరికి 1996 జనవరి 18న గుండెపోటుతో కన్నుమూశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, పార్టీ గుర్తు, ఆస్తులు చివరికి చంద్రబాబు ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఎన్టీఆర్ ఆఖరి వరకు ఈ అవమానాన్ని మరిచిపోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.








