బాహుబలి-3 పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత.. ఫ్యాన్స్‌కు పండుగే!

బాహుబలి-3పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత.. ఫ్యాన్స్‌కు పండుగే!

ప్రభాస్ (Prabhas), రాజమౌళి (Rajamouli)ల అద్భుత సృష్టి ‘బాహుబలి’ (Baahubali) ఫ్రాంచైజ్ మరోసారి తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ బ్లాక్‌బస్టర్ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా, మొదటి రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్‌’ (Baahubali: The Epic) పేరుతో ఒకే చిత్రంగా తీసుకువస్తున్నారు. ఈ కొత్త ఎడిషన్ అక్టోబర్‌ 31న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలోనే, ‘బాహుబలి 3’ గురించిన ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ అంశంపై తాజాగా చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు.

‘బాహుబలి 3’ వస్తుందా?

‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమా చివర్లో ‘బాహుబలి 3’ (Baahubali 3) ప్రకటన ఉంటుందని అందరూ ఆశించినప్పటికీ, శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) దాన్ని కేవలం రూమర్ గా కొట్టిపారేశారు. అయితే, అభిమానులకు సంతోషాన్నిచ్చే ముఖ్య విషయాన్ని ఆయన వెల్లడించారు. బాహుబలి 3 ఖచ్చితంగా తెరకెక్కుతుందని ఆయన ప్రకటించారు!

అయితే, ఈ సినిమా మొదలుకావడానికి చాలా వర్క్ చేయాల్సి ఉందని, తాము అనుకున్నంత త్వరగా షూటింగ్ ప్రారంభం కాకపోవచ్చని శోభు స్పష్టం చేశారు. ఏదేమైనా, బాహుబలి 3 వస్తుందనే అప్‌డేట్ రావడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ కొత్త ఎడిషన్‌కు సంబంధించిన రన్‌టైమ్‌పై ఇంకా పూర్తి స్పష్టత లేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment