---Advertisement---

పింక్ జెర్సీతో బ‌రిలోకి ఆసిస్‌.. కార‌ణం ఏంటంటే..

పింక్ జెర్సీతో బ‌రిలోకి ఆసిస్‌.. కార‌ణం ఏంటంటే..
---Advertisement---

భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఈనెల 3 నుంచి జరగనున్న ఐదో టెస్ట్ (పింక్ టెస్ట్) మైదానంలో అత్యంత ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన స్టేడియం మొత్తం పింక్ కలర్లో అలంకరించనున్న‌ట్లు తెలుస్తోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆస్ట్రేలియా ప్లేయర్లు కూడా పింక్ క్యాప్స్ ధరించి మెరిసిపోతారట‌. ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఆసిస్ క్రీడాకారులంతా పింక్ జ‌ర్సీతో బ‌రిలోకి దిగుతార‌ని, ఇందుకు సంబంధించి ఓ ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉందంటూ చెబుతున్నారు.

పింక్ టెస్టు ప్రత్యేకత
2009 నుండి పింక్ టెస్ట్‌ను నిర్వహిస్తూ, బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచడం, మరియు మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా క్యాన్సర్ బాధితులకు సహాయం అందిస్తున్నారు. 2008లో తన భార్య క్యాన్సర్ కారణంగా మరణించడంతో మాజీ క్రికెట‌ర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఈ ఫౌండేషన్‌ను స్థాపించి, క్యాన్సర్ రోగుల కోసం నిధులను సేకరిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment