టీమిండియాతో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

టీమిండియాతో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

భారత్‌ (India)లో అక్టోబర్ 19వ తేదీ నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు (Australia Cricket Team) పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు మరియు ఆస్ట్రేలియా జట్టు మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20లు అక్టోబర్ 29 నుంచి ప్రారంభమవుతాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)(BCCI) ఇప్పటికే టీమిండియా (Team India) తుది జట్టును ప్రకటించగా, తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా తమ వన్డే మరియు టీ20 జట్లను అధికారికంగా ప్రకటించింది.

గాయాలతో కీలక ఆటగాళ్ల గైర్హాజరీ

ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (Cummins) గాయం కారణంగా దూరం అయ్యాడు. అదే విధంగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అతడు బిగ్‌బాష్ లీగ్ ద్వారా తిరిగి మైదానంలోకి రానున్నాడని సమాచారం. అలాగే, వన్డే వరల్డ్‌కప్ 2023 విజయంలో కీలక పాత్ర పోషించిన మర్నస్ లబుషేన్ ఈ సిరీస్‌ జట్టులోకి ఎంపిక కాలేదు. అతడు ఫామ్‌లో లేకపోవడమే దీనికి కారణమని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

ఆస్ట్రేలియా వన్డే జట్టు:

మిచ్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కేరీ, కూపర్ కానెల్లీ, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బ్రాట్‌లెట్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మ్యాట్ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

ఆస్ట్రేలియా టీ20 జట్టు:

మిచ్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, సీన్ అబోట్, జేవియర్ బ్రాట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ ఓవెన్, మ్యాట్ షార్ట్, మార్కస్ స్టాయినిస్, ఆడం జంపా.

Join WhatsApp

Join Now

Leave a Comment