దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీ (Janasena Party) నుంచి బహిష్కరణకు గురైన రాజమండ్రి (Rajahmundry) జనసేన ఇన్‌చార్జ్ అత్తి సత్యనారాయణ (Atti Satyanarayana), ప్రముఖ నిర్మాత, తెలంగాణ (Telangana) ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju)పై తీవ్ర ఆరోపణలు చేశారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ (Theaters Bandh) ప్రకటన వివాదంలో తనపై తప్పుడు నిందలు వేసి, తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దిల్ రాజుపై కోర్టుకు వెళతానని సత్యనారాయణ హెచ్చరించారు.

అత్తి సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి (Sirish Reddy). తన తమ్ముడిని కాపాడుకోవడానికి దిల్ రాజు దురుద్దేశంతో నా పేరును బయటపెట్టారు. నేను థియేటర్ బంద్ గురించి ఎక్కడా ప్రకటించలేదు. దిల్ రాజు కమల్ హాసన్‌ (Kamal Haasan)ను మించి ఆస్కార్ రేంజ్‌లో నటించారు” అని విమర్శించారు.

“పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నా దేవుడు. ఆయన సినిమా ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu)ను నేను ఎందుకు అడ్డుకుంటాను? దిల్ రాజు తన స్వార్థ ప్రయోజనాల కోసం నా పేరును చెడగొట్టి, నా రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ కొట్టారు. ఈ అబద్ధాలకు వ్యతిరేకంగా నేను కోర్టుకు వెళతాను” అని హెచ్చరించారు. ఏపీలో థియేటర్ యాజమాన్య సంఘాలు రెవెన్యూ షేరింగ్, ఇతర ఆర్థిక సమస్యలపై జూన్ 1 నుంచి థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి ప్రముఖ నిర్మాతలపై జనసేన నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, బంద్‌కు అత్తి సత్యనారాయణ కారణమని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం జనసేన నేత అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment