విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఇంటిపై దాడి కలకలం సృష్టించింది. దాడి చేసే క్రమంలో ఓ వ్యక్తి తనను చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడని మాజీ ఎంపీ వెల్లడించారు. తన ఇంటిపై దాడి చేసి చంపుతానని వార్నింగ్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ మేరకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌కు కేశినేని నాని లేఖ రాశారు. ఫోన్ లో తనను కడియాల చక్రవర్తి అనే వ్యక్తి బెదిరించాడని, ఈడీకి (ED) కి ఇచ్చిన ఫిర్యాదులో తన పేరుతో పాటు ఎంపీ కేశినేని చిన్ని పేరును ఉపసంహరించుకోవాలని, లేదంటే చంపేస్తానని బెదిరించడంతో పాటు ఫోన్ లో తీవ్ర దుర్భాషలాడినట్లు కేశినేని నాని వివరించారు.
శనివారం ఉదయం విజయవాడలోని కేశినేని నిలయంపై దాడి చేశారని, ఇంటిపై దాడి చేయడంతో పాటు వాచ్‌మెన్‌ని కూడా బెదిరించారని విజయవాడ సీపీకి రాసిన లేఖలో మాజీ ఎంపీ నాని పేర్కొన్నారు. ఇంటిపై దాడి చేసి నానిని చంపేస్తామంటూ కడియాల చక్రవర్తి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడని సీపీకి వివరించారు. లిక్కర్ కేసులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్)కి సంబంధాలు ఉన్నాయని, ఈడీతో ఎంక్వయిరీ చేయాలంటూ లేఖ రాసిన నేపథ్యంలో బెదిరింపులు వస్తున్నాయని లేఖ పేర్కొన్నారు నాని. ఇంటిపై దాడి చేసి, తనను చంపేస్తానని బెదిరింపులకు దిగిన కడియాల చక్రవర్తి ఫోన్ నెంబర్ ఆధారంగా ఎంక్వయిరీ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌కు కోరారు.
మద్యం కేసులో చిన్ని పాత్రపై సీఎంకు లేఖ
మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతని సహాయకుడు దిలీప్ పైలాలకు టీడీపీ ఎంపీ చిన్నితో సంబంధం ఉన్నట్లు తీవ్రంగా కేశినేని నాని గతంలో ఆరోపణలు చేస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ముఖ్యంగా ఈ ఇద్దరితో పాటు చిన్ని భార్య జానకీ లక్ష్మీ కూడా ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ (Pryde Infracon LLP) అనే కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు. ఈ కేసులో చిన్నీ పాత్రపై కూడా విచారణ జరిపించాలని కోరారు. కాగా, నాని రాసిన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మద్యం కేసులో చిన్నీ పాత్ర గురించి సీఎంకు ఫిర్యాదు చేయడంతోనే ఆయన ఇంటిపై దాడి, చంపుతామంటూ బెదిరింపులకు దిగడం ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది.
To⁰The Commissioner of Police ,@VjaCityPolice ⁰Vijayawada.
— Kesineni Nani (@kesineni_nani) May 11, 2025
Date: 11 May 2025
Subject: Death Threat by Chakravarthy Kadiyala and Attack on My Residence – Request for Criminal Action
Dear Sir,
I am writing to formally lodge a serious criminal complaint regarding two deeply…