విశాఖలో మరోసారి హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఒక ఆటో డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల ప్రకారం, ఆ ఆటో డ్రైవర్ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత ఎవరికైనా జరిగిన విషయాన్ని చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆమెను నిలదీయగా, తాను ఎదుర్కొన్న దారుణాన్ని వెల్లడించింది. వెంటనే తల్లిదండ్రులు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను మెడికల్ పరీక్షల కోసం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నారులపై పెరుగుతున్న దారుణాలను అరికట్టేందుకు పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.








