---Advertisement---

వాజ్‌పేయీ శతజయంతి.. ప్రముఖుల ఘన నివాళి

వాజ్‌పేయీ శతజయంతి.. ప్రముఖుల ఘన నివాళి
---Advertisement---

భారతదేశ మాజీ ప్ర‌ధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ శతజయంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ వద్ద దేశ ప్రముఖులు ఆయనకు ఘ‌న నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, పలువురు ఎంపీలు వాజ్‌పేయీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయ‌న దేశానికి అందించిన సేవ‌ల‌ను కొనియాడారు.

జాతి గర్వించదగిన నేత.. : చంద్రబాబు
వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు ‘ఎక్స్’లో ఓ పోస్ట్‌ చేశారు. “భారతజాతి గర్వించదగిన నేత వాజ్‌పేయీ. ఆయన దూరదృష్టి వల్లనే నేడు మన దేశం ప్రపంచదేశాలతో పోటీ పడుతున్నది. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. సంస్కరణల ప్రతిపాదనలపై ఆయన స్పందించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.

వాజ్‌పేయీకి వైఎస్ జగన్ నివాళి
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా వాజ్‌పేయీకి ఘన నివాళి అర్పించారు. “అటల్ బిహారీ వాజ్‌పేయీ క్లిష్టమైన సమయాల్లో భారతదేశానికి మార్గనిర్దేశం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన 100వ జయంతి సందర్భంగా వాజ్‌పేయీకి నివాళులు అర్పిస్తున్నాను. ఆయన శాశ్వత వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది” అని జగన్ ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment