భార్యను రెండేళ్లు గదిలో బంధించి, అస్తిపంజరంలా మార్చి హత్య!!

భార్యను రెండేళ్లు గదిలో బంధించి, అస్తిపంజరంలా మార్చి హత్య!!

భద్రాద్రి (Bhadradri) కొత్తగూడెం (Kothagudem) జిల్లా అశ్వారావుపేట (Ashwaraopet) లో పూల లక్ష్మీ ప్రసన్న (Poola Lakshmi Prasanna) (30) మృతి ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందగా, మృతదేహాన్ని అశ్వారావుపేటకు అంబులెన్స్‌లో తీసుకొచ్చిన వెంటనే ఆమె బంధువులు ఆమె భర్త నరేశ్‌(Naresh)పై దాడి చేశారు. లక్ష్మీ ప్రసన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆమె తల్లిదండ్రులు నరేశ్‌తో పాటు అత్త విజయలక్ష్మి, నరేశ్ అక్క బావ దాసరి భూలక్ష్మి, దాసరి శ్రీనివాసరావులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు దిగ్బంధం చేసిన మృతురాలి బంధువులు.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు, దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.

లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రుల ఆరోపణల ప్రకారం, ఆమె భర్త కుటుంబం రెండేళ్లుగా ఆమెకు తగిన ఆహారం ఇవ్వకుండా, ఫోన్‌లో కూడా మాట్లాడనీయకుండా హింసించి, చివరకు ఆమె మృతికి కారణమయ్యారని ఆరోపించారు. వివాహ సమయంలో రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన బంగారం, అర ఎకరం పొలం, రెండు ఎకరాల మామిడి తోట కట్నంగా ఇచ్చామని, అయినా ఆమెను హింసించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శరీరం బలహీనంగా, ఎముకల గూడులా కనిపించడం అనుమానాలను రేకెత్తించింది. అయితే, నరేశ్ బావ దాసరి శ్రీనివాసరావు, లక్ష్మీ ప్రసన్నకు థైరాయిడ్, రక్తహీనత సమస్యలున్నాయని, ఆమె తల్లిదండ్రుల ఆరోపణలు సత్యదూరమని వాదించారు. పోలీసులు నరేశ్‌తో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనలో మరింత ఉద్రిక్తతకు కారణమైన అంశం, నిందితుడైన నరేశ్ బావ శ్రీనివాసరావు పోలీసు వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కనిపించడం. దీనితో కోపోద్రిక్తులైన లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు, జనం భారీగా గుమిగూడారు. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనలు తీవ్రమవడంతో, పోలీసులు నిందితులను వేరే ప్రాంతానికి తరలించారు. ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది, స్థానికంగా న్యాయం కోసం బంధువుల ఆందోళనలు, రోడ్డు ధర్నాలు కొనసాగుతున్నాయి. అశ్వారావుపేటలో ఈ ఘటన స్థానిక ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది, పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment