ఫార్ములా – ఈ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

ఫార్ములా - ఈ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన వివాదాస్పద లావాదేవీలపై ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు గ్రీన్‌కో సంస్థల ప్రతినిధులు శనివారం ఏసీబీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు సంబంధించి ఫార్ములా ఈ–ఆపరేషన్ లిమిటెడ్ (ఎఫ్‌ఈఓ), ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్, మరియు పట్టణాభివృద్ధి శాఖ మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల నేపథ్యంపై ఇప్పుడు ప్రశ్నలు ఎదురు కావడంతో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది.

సీజన్ 9లో ఏస్ నెక్ట్స్‌జెన్ కీలక స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ సంస్థకు గ్రీన్‌కో మాతృ సంస్థ. గ్రీన్‌కో నుంచి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి కొన్ని లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి.

సోదాలు, ఆధారాలు
ఇటీవల ఏసీబీ అధికారులు ఈ సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలను పరిశీలించిన తరువాత, మరింత సమాచారం సేకరించడానికి ఏస్ నెక్ట్స్‌జెన్ మరియు గ్రీన్‌కో ప్రతినిధులను విచారించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment