ఆసియా కప్ (Asia Cup) 2025 కోసం భారత జట్టు (India Team)ను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వైస్ కెప్టెన్‌గా శుభ్మన్ గిల్(Shubman Gill) ఎంపికయ్యారు. ఈ జట్టులో యువ ఆటగాళ్ళతో పాటు సీనియర్లకు కూడా చోటు లభించింది.
జట్టులో కీలక ఆటగాళ్లు
భారత జట్టులో పదిహేను మంది సభ్యులున్నారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్ వంటి యువ సంచలనాలు జట్టులోకి వచ్చారు. ఫినిషర్ల పాత్రను హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్ పోషించనున్నారు. వికెట్ కీపర్లుగా జితేష్ శర్మ, సంజు శాంసన్ ఎంపికయ్యారు.
బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. అతనికి తోడుగా అర్ష్‌దీప్ సింగ్ మరియు యువ సంచలనం హర్షిత్ రాణా పేస్ బాధ్యతలను పంచుకుంటారు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి మరియు కుల్దీప్ యాదవ్ ఉన్నారు.
జట్టు పూర్తి వివరాలు
కెప్టెన్: సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్: శుభ్మన్ గిల్
బ్యాట్స్‌మెన్స్: అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్
ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్
వికెట్ కీపర్లు: జితేష్ శర్మ, సంజు శాంసన్
బౌలర్లు: జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా
ఈ జట్టులో యువ మరియు అనుభవం కలగలిపి ఉండడంతో, ఆసియా కప్‌లో టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది.







